Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది.
ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో తన సహచర ఆటగాళ్లకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలిపాడు. ఈ భావోద్వేగ క్షణాలను ఇసిబి మీడియా టీమ్ వీడియో తీసింది. అయితే.. మ్యాచ్ ఇంకా నడుస్తుండగానే, టీ బ్రేక్‌కు ముందు ఆడియోతో కూడిన ఈ ఫుటేజీని బ్రాడ్కాస్టర్లకు, సోషల్ మీడియాకు విడుదల చేశారు.
Also Read
నిబంధనల ఉల్లంఘన..
ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ప్రకారం.. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమ్ డ్రెస్సింగ్ రూమ్ (PMOA) నుండి ఎలాంటి ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం నిషేధం. బ్రాడ్‌కాస్టింగ్ ప్రయోజనాల కోసం డ్రెస్సింగ్ రూమ్‌లలో ఎలాంటి రికార్డింగ్ పరికరాలను ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్ ముగిసే వరకు ఇలాంటి కంటెంట్‌ను దాచాలని ఐసీసీ గుర్తుచేసింది.
బెన్ స్టోక్స్ స్పందన..
మరోవైపు, తాను ఒత్తిడిలోనే రిటైర్ అయ్యాననే ఊహాగానాలపై బెన్ స్టోక్స్ స్పందించాడు. ఒక నివేదికను షేర్ చేస్తూ.. ‘దాన్ని పక్కన పడేయండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇటువంటి నిరాధారమైన వాటిని నా దగ్గరకు రానివ్వొద్దని.. నిజాలు తెలియకుండా మాట్లాడొద్దని.. అటువంటి వారు ఉంటే బయటకు వెళ్లాలని ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
అద్భుతమైన కెరీర్..
గత 15 ఏళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్లో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల విజయంలో అద్భుత ప్రదర్శన చేశాడు. 2022లో టెస్ట్ కెప్టెన్ అయ్యాక ‘బాజ్‌బాల్’ శైలితో టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేశాడు. మైదానం వెలుపల మానసిక ఆరోగ్య సమస్యలు, 2018 బ్రిస్టల్ వివాదం వంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, అతను ఇంగ్లాండ్ మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఈ వివాదంపై ఈసీబీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!