NTV Telugu Site icon

Ben Stokes Record: బెన్ స్టోక్స్‌ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!

Ben Stokes Test

Ben Stokes Test

Ben Stokes Joins Jacques Kallis and Sir Garfield Sobers Elite List: యాషెస్‌ సిరీస్‌ 2023లో కీలకమైన మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ఆటలో మొత్తం 11 వికెట్లు పడడంతో.. మ్యాచ్‌ మలుపులు తిరుగుతూ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ అరుదైన రికార్డు సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తక్కువ పరుగులే పరిమితం అయినా బెన్ స్టోక్స్‌ మాత్రం 80 పరుగులు చేశాడు. తన బజ్‌బాల్‌ ఆటను ఆస్ట్రేలియాకు మరోసారి రుచి చూపించాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు స్టోక్స్‌ సమయం తీసుకున్నాడు. 168 పరుగుల వద్ద మార్క్‌ వుడ్‌ (24) ఎనిమిదో వికెట్‌ రూపంలో ఔట్ కాగానే.. స్టోక్స్‌ గేర్‌ మార్చాడు. అప్పటికి స్టోక్స్‌ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫోర్లు సిక్సులు బాదుతూ 106 బంతుల్లో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

Also Read: Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!

హాఫ్ సెంచరీ చేసే క్రమంలో బెన్ స్టోక్స్‌ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 6 వేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు స్టోక్స్‌ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయగా.. 197 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 6 వేల పరుగులు, వంద వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్‌ కలిస్‌ ఉన్నాడు. కలిస్‌ 13,289 పరుగులు.. 292 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో విండీస్‌ దిగ్గజం సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ 8,032 పరుగులు.. 235 వికెట్లు తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్‌ ఆదుకోకపోతే ఇంగ్లండ్ పరిస్థితి దారుణంగా ఉండేది. మూడో రోజు రెండో బంతికే జో రూట్‌ (19), కొద్దిసేపటికి జానీ బెయిర్‌స్టో (12) ఔట్‌ అవ్వడంతో 87/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో మొయిన్‌ అలీ (21)తో కలిసి స్టోక్స్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కోలుకుంటున్న దశలో అలీ సహా క్రిస్‌ వోక్స్‌ (10) పెవిలియన్ చేరారు. రెండో సెషన్‌లో మార్క్‌ వుడ్‌ ఔట్ అనంతరం స్టోక్స్‌ బాదుడు షురూ అయింది. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడమూ కలిసొచ్చింది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే?

 

Show comments