NTV Telugu Site icon

Ben Stokes: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. కర్రల సాయంతో నడుస్తున్న బెన్ స్టోక్స్!

Ben Stokes Injury

Ben Stokes Injury

England Captain Ben Stokes Waks With the help of sticks: శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ బెన్ స్టోక్స్ గాయం కార‌ణంగా లంక‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ‘ది హాండ్ర‌డ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌ ఛార్జర్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఆదివారం (ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. మ్యాచ్‌లో సింగిల్ కోసం వేగంగా ప‌రిగెత్త‌డంతో అతడి తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో తీవ్ర‌మైన నొప్పితో స్టోక్సీ విల్ల‌విల్లాడు.

ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌ట‌కి బెన్ స్టోక్స్ నొప్పి మాత్రం త‌గ్గ‌లేదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడడంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం స్టోక్సీ కర్రల సాయంతో మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు కర్రల సాయంతోనే నడుస్తున్నాడు. గాయం ఎక్కువగా ఉండడంతో లంక‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఆలీ పోప్ నాయకత్వం వహిస్తాడు. అక్టోబర్‌లో పాకిస్థాన్ టూర్‌లో స్టోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు.

Also Read: Google Pixel 9 Price: గూగుల్‌ పిక్సెల్‌ 9 ఫోన్స్ వచ్చేశాయి.. ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే!

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఆగస్టు 21 నుంచి తొలి మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 29 నుండి లార్డ్స్‌లో రెండవ టెస్ట్, సెప్టెంబర్ 6 నుంచి ఓవల్‌లో మూడో టెస్ట్ ఆరంభమవుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.

Show comments