Ben Stokes: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. కర్రల సాయంతో నడుస్తున్న బెన్ స్టోక్స్!
- ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
- బెన్ స్టోక్స్‌కు గాయం
- ఇంగ్లండ్ సారథిగా ఆలీ పోప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England Captain Ben Stokes Waks With the help of sticks: శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా లంకతో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ‘ది హాండ్రడ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఆదివారం (ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మ్యాచ్‌లో సింగిల్ కోసం వేగంగా పరిగెత్తడంతో అతడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో తీవ్రమైన నొప్పితో స్టోక్సీ విల్లవిల్లాడు.
ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి బెన్ స్టోక్స్ నొప్పి మాత్రం తగ్గలేదు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడడంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. మ్యాచ్ అనంతరం స్టోక్సీ కర్రల సాయంతో మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతడు కర్రల సాయంతోనే నడుస్తున్నాడు. గాయం ఎక్కువగా ఉండడంతో లంకతో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. స్టోక్స్ గైర్హాజరీలో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఆలీ పోప్ నాయకత్వం వహిస్తాడు. అక్టోబర్‌లో పాకిస్థాన్ టూర్‌లో స్టోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఇప్పటికే స్టార్ ఓపెన్ జాక్ క్రాలీ గాయం కారణంగా దూరమయ్యాడు.
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
Also Read: Google Pixel 9 Price: గూగుల్ పిక్సెల్ 9 ఫోన్స్ వచ్చేశాయి.. ధర, ఫీచర్ల డీటెయిల్స్ ఇవే!
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, శ్రీలంక మధ్య ఆగస్టు 21 నుంచి తొలి మ్యాచ్ జరగనుంది. ఆగస్టు 29 నుండి లార్డ్స్‌లో రెండవ టెస్ట్, సెప్టెంబర్ 6 నుంచి ఓవల్‌లో మూడో టెస్ట్ ఆరంభమవుతుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!