NTV Telugu Site icon

Haindava : ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్: బెల్లంబాబు సినిమాకి హిట్ కళ కనిపిస్తోందే!!

New Project (76)

New Project (76)

Haindava : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో నటిస్తున్న 12వ చిత్రాన్ని పూర్తి అడ్వెంచర్ కథతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇటీవల, బెల్లంకొండ కొండ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేస్తూ ఉన్న లుక్‌ను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Read Also:Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..

ఈ సినిమాకు ‘హైందవ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్ ఏమిటనేది మనకు ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లోనే చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించారు. ఈ సినిమాలో హైందవ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు ప్రేక్షకులకు చూపెట్టబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. హిందుత్వాన్ని హీరో ఎలా కాపాడతాడు అనేది మనం సినిమాలో చూడాల్సి ఉంటుంది. ఇందులో కొండలు, అటవీ ప్రాంతం విజువల్స్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లో ఆలయంపై ఇంధనం చల్లే సన్నివేశాలు, గర్జిస్తున్న సింహం, బెల్లంకొండ బైక్‌పై వాటిని నియంత్రించేందుకు వస్తున్న విజువల్స్ ఉన్నాయి. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా లియోన్ జేమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. సంయుక్తా ఈ చిత్రంలో సమీర పాత్రలో కనిపిస్తుండగా, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు.

Read Also:Swayambhu Movie : నిఖిల్ ‘స్వయంభూ’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు

Show comments