Site icon NTV Telugu

Bellaiah Naik : మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయింది

Bellaiah Naik

Bellaiah Naik

మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందన్నారు పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం నిందితుల వైపు నిలబడుతుందన్నారు. వికారాబాద్‌లో ఓ ఎస్సై ఆత్మహత్య నుండి మొదలుకుని… ప్రీతి ఆత్మహత్య వరకు ప్రభుత్వం పెడధోరణి కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రీతి ఫిర్యాదు… చేస్తే హెచ్‌ఓడీ కూడా తిట్టాడని, ఆసుపత్రిలో ఏం జరిగింది అనేది తెలియదన్నారు. మెరుగైన వైద్యం ఇవ్వండి అని మహిళా కమిషన్ ఆదేశాలతో.. చనిపోయింది అని ప్రకటించారని ఆయన ధ్వజమెత్తారు.

Also Read : Drunken Drive : బంజారాహిల్స్‌లో మద్యం మత్తులో యువకుడి వీరంగం

నిమ్స్ లో డెడ్ బాడీకి చికిత్స చేశారని, ప్రీతి వాట్సప్.. చాట్ ఎలా డిలీట్ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఎవరు చేశారు అనేది తేలాలి అని ఆయన అన్నారు. కాజ్ ఆఫ్ డెత్ చెప్పండి అని తండ్రి ఆడిగితే కూడా ఇవ్వట్లేదని, వేధింపులు ఉన్నాయని చెప్తుంటే.. ఆత్మహత్య అంటున్నారని ఆయన మండిపడ్డారు. చంపిన వాళ్ళను రక్షించే కుట్ర జరుగుతుందని, రాజకీయంగా బీఆర్‌ఎస్‌కి ఇబ్బంది అని అసలు విషయాలు దాస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read : Marimuthu : వివాదంలో ఇరుక్కున్న ప్రముఖ నటుడు.. మహిళ ఫోటోకు రిప్లై ఇవ్వడంతో..

Exit mobile version