Princess Astrid: బెల్జియం-భారత్ వ్యాపార సంబంధాల భాగంగా బెల్జియం రాజకుమారి ఎస్ట్రిడ్ మార్చి 2న 65 మంది బెల్జియన్ ప్రతినిధులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బిజనౌర్ జిల్లా, మహమూద్‌పుర్ గంజ్ గ్రామానికి రానున్నారు. అక్కడ బెల్జియంకు చెందిన ప్రముఖ ఆలూ ప్రాసెసింగ్ కంపెనీ “అగ్రిస్టో మాసా” సంబంధించిన రెండో ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రాజకుమారి ఎస్ట్రిడ్ బెల్జియం రాజు కింగ్ ఫిలిప్ చిన్నబిడ్డ. ఈ కార్యక్రమానికి బెల్జియం ఉప ప్రధాని, రక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, విద్య, వ్యాపార రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. బెల్జియం-భారత్ వ్యాపార సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రాజకుమారి ఎస్ట్రిడ్, ఆమెతోపాటు వచ్చిన బెల్జియం ప్రతినిధులకు స్వాగతం పలకనున్నారు.
Read Also: Donald Trump: ట్రాన్స్‌జెండర్ సైనికులను గుర్తించే పనిలో పడ్డ అమెరికా
2019లో బెల్జియం దేశ “అగ్రిస్టో” కంపెనీ బిజనౌర్ చాంద్‌పూర్ మార్గంలో ఆలూ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో ఫ్రెంచ్ ఫ్రై, మాష్ పటాటో, ఆలూ పొడి, చిప్స్ వంటి ఉత్పత్తులను తయారుచేసి, దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. బెల్జియం-భారత్ వ్యాపార సహకారాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రూ.750 కోట్లతో మూడు కొత్త యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆలూ ప్రాసెసింగ్, వెజిటబుల్ ప్రాసెసింగ్, ఆలూ నుండి జిన్, విస్కీ, వోడ్కా తయారీ వంటి విభాగాలు ఉంటాయి.
యూపీలోని బిజనౌర్, అమ్రోహ, సంభల్, మురాదాబాద్, హాపూర్ వంటి జిల్లాల్లో ప్రధానంగా రైతులను ఆలూ పంట సాగు చేయడానికి ప్రోత్సహించేందుకు “అగ్రిస్టో” సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం రైతులతో బైబ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకుంది కంపెనీ. ఇందులో ఉచితంగా బీజాలు, ఎరువులు, పురుగుమందులు అందజేయడం అలాగే పంట కోత అనంతరం నేరుగా నగదు చెల్లింపు వాళ్ళ రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. బిజనౌర్‌కు చెందిన రైతు శివరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, తన 50 ఎకరాల భూమిలో 1,000 క్వింటాళ్ల ఆలూ పండించినట్లు తెలిపారు. ఈ పంటతో రెండున్నర నెలల్లో రూ.8 లక్షల నికర లాభం పొందినట్లు తెలిపారు.
Read Also: Sabdham Movie Review: శబ్దం మూవీ రివ్యూ..ఆత్మహత్యలా? ఆత్మల హత్యలా ?
బిజనౌర్ జిల్లా మేజిస్ట్రేట్ జస్జీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ బిజనౌర్ జిల్లాతో పాటు మొత్తం ఉత్తరప్రదేశ్‌కు గర్వకారణం. అంతర్జాతీయ స్థాయి “అగ్రిస్టో” కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. మొత్తానికి బెల్జియం-భారత్ వ్యాపార సహకారం ద్వారా స్థానిక రైతులు లాభపడటమే కాకుండా, ఉత్తరప్రదేశ్ నుండి అంతర్జాతీయ మార్కెట్లకు భారీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు, వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.