Site icon NTV Telugu

Man Kills Mother: తల్లిని దారుణంగా చంపి.. ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టి కాలువలో పడేశాడు..

Crime News

Crime News

Man Kills Mother: బెల్జియంలో 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల్లి శరీరాన్ని ముక్కలుగా నరికి భాగాలను ఫ్రిడ్జిలో పెట్టి ఓ కాలువలో పడేశాడు. గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి ఈ హత్య గురించి చెప్పాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. మద్యం మత్తులో ఉండి ఆ వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు భావించారు. హత్య, ఛిద్రం చేయడం, శరీర భాగాలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచడం గురించి తెలుసుకున్నట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. తర్వాత పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడంతో రిఫ్రిజిరేటర్‌లో మహిళ శరీర భాగాలు కనిపించాయి.

Also Read: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?

రిఫ్రిజిరేటర్‌లో రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం వారు బాధితురాలి మొండెం, తలను మరొక కంటైనర్‌లో కనుగొన్నారు. ఆ మహిళ గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆచూకీని కనిపెట్టారు. అప్పటికే నిందితుడు అప్రమత్తమై దక్షిణ కొరియాకు పారిపోవాలని పథకం వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన తల్లిని హత్య చేసినట్టు అంగీకరించాడు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ హత్య జులై 10న జరిగింది. తానే తన తల్లిని చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి కాల్వలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా తల్లి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. మాటమాటా పెరిగి కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

బాధితురాలు తన ఇద్దరు పిల్లలు, మనవరాలితో నివసించే లీజ్ ప్రాంతంలోని సెరాయింగ్‌లో ఈ సంఘటన జరిగింది. కొవిడ్ -19 మహమ్మారి తర్వాత కొడుకు తనతో కలిసి జీవించడానికి తిరిగి వచ్చినప్పటి నుండి తల్లి, కొడుకు తరచూ వాగ్వాదానికి దిగుతున్నట్లు విచారణలో తేలింది.

Exit mobile version