Sanjay Manjrekar Says Behave at MI vs RR Toss Time: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడినా కూడా ముంబైకి కలిసి రాలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. కెప్టెన్ మారినా రాత మారని ముంబై.. టోర్నీలో ఇంకా ఖాతా తెరవలేదు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై.. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పు జరిగిన విషయం తెలిసిందే. ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి.. హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ మార్పును రోహిత్ అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ సోమవారం సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడింది. స్టేడియంకు భారీగా తరలివచ్చిన ఫాన్స్.. టాస్ సమయంలో ‘రోహిత్, రోహిత్..’ అంటూ పెద్దగా అరిచారు. దాంతో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. హార్దిక్‌కు అండగా నిలిచాడు.
Also Read: Ranbir Kapoor-Rashmika: మరోసారి రణ్‌బీర్-రష్మిక కాంబో!
టాస్ వేయడానికి ముందు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌లను సంజయ్ మంజ్రేకర్ పరిచయం చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. హార్దిక్ పాండ్యా పేరును ప్రత్యేకంగా అభిమానులకు పరిచయం చేశాడు. ‘టాస్‌కు సమయం ఆసన్నమైంది. నాతో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచిగా ప్రవర్తించండి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మనతో ఉన్నాడు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. మంజ్రేకర్ మద్దతు తర్వాత హార్దిక్ చిరునవ్వు చిందించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.