Old Building Collapses in Begum Bazar: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వర్షాలకు నగరంలోని బేగంబజార్‌లో ఓ పురాతన బిల్డింగ్ కుప్పకూలింది. ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read: Coolie Review: రజనీకాంత్ ‘కూలీ’ రివ్యూ!
భవనం శిథిలావస్థకు చేరుకుందని, వేంటనే కూల్చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే యజమానికి నోటీసులు ఇచ్చారు. అయితే జీహెచ్ఎంసీ హెచ్చరికలను భవన యజమాని పట్టించుకోలేదు. బిల్డింగ్ కూలిపోగా.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో సరిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంబజార్‌లో ఇలాంటి పురాతన బిల్డింగ్స్ లోనే వ్యాపారులు షాప్స్ కొనసాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను కూల్చేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. బల్దియా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారని జనాలు ఫైర్ అవుతున్నారు.
