బీర్ బాటిల్ తో యోగా చేయడం ఏంటి? అని విచిత్రంగా అనిపిస్తోంది కదా.. ప్రపంచంలో చాలాచోట్ల ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. 2016లో ప్రారంభమైన బీర్ యోగా ఇప్పుడు అనేక దేశాలకు పాకింది. యోగా డే సందర్భంగా విదేశాల్లో కొందరు వ్యక్తులు చేస్తున్న బీర్ యోగా చూస్తే మీరు షాక్ అవుతారు.
Read Also: Power Naps: పగటి నిద్ర మెదడుకు మంచిది… అధ్యయనం వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా యోగాకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి అంటే మనసు ఉల్లాసంగా ఉండాలి. యోగాతో అన్ని రోగాలు నయమవుతాయని చెబుతారు. అయితే కొంతకాలంగా యోగాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొన్ని దేశాలు బీర్ యోగా పేరుతో కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. అయితే, ఈ కొత్త ట్రెండ్‌పై భారతీయులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Read Also: Paruchuri Venkateswara Rao: సెంటిమెంట్ తో ఆకట్టుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు
బీర్ యోగాను బెర్లిన్‌కి చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జూలా 2016లో స్టార్ట్ చేశారు. అలా మొదలైన బీర్ యోగా జర్మనీ నుంచి ఇతర దేశాలకు స్పీడ్ గా పాకింది. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల నుంచి థాయ్ లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. నిజానికి యోగా చేసేటపుడు ఖాళీ కడుపుతో చేయాలి.. అలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా చురుకుగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ.. బీర్ యోగా చేయడం వల్ల మంచి అనుభూతి వస్తుంది తప్ప.. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు అని నిపుణులు అంటున్నారు.
Read Also: Portable Air Conditioner Price: ధర 2 వేలు.. 90 శాతం విద్యుత్ ఆదా! ఏసీ మాదిరి కూలింగ్
డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్‌లో రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు యోగా చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ యోగా చేసే ప్రతి ఒక్కరి చేతిలో బీర్ బాటిల్ ఉంది. ఈ వింత కాన్సెప్ట్ మాత్రం జనాలను ఆకర్షించింది. అయితే ఈ యోగాపై భారతీయులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.