Site icon NTV Telugu

Paris: నల్లులతో నరకం చూస్తున్న ఫ్యాషన్ నగరం

Bed Bugs

Bed Bugs

ఫ్రాన్స్ ఈ మాట వినగానే ఒక మంచి పర్యాటక  కేంద్రం, ఫ్యాషన్ ప్రపంచం అని గుర్తుకు వస్తుంది. ఎక్కడ చూసినా అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసిన నల్లులు దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, చివరికి సినిమా హాళ్లలో సైతం ఈ నల్లులే కనిపిస్తు్న్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ నల్లుల విషయంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారంటేనే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: Anil Kumar Yadav: చంద్రబాబు అరెస్టుకు నిరసనల పేరుతో నవ్వుతూ విజిల్స్, డ్యాన్స్ చేశారు..

నల్లి పురుగుల కట్టడికిగానూ వచ్చే వారం ప్రజారవాణా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్‌ రవాణాశాఖ మంత్రి క్లెమెంట్‌ బ్యూన్‌ తెలిపారు. మీకు ఎక్కడ కావాలన్నా నల్లులు కనిపిస్తాయి. మీరు ఇంటికి కావాలంటే చక్కగా తీసుకువెళ్లొచ్చు అంటూ అక్కడి వారు కామెంట్ చేసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం నుంచే ఫ్రాన్స్ లో ఈ నల్లుల బెడగ మొదలయ్యింది. వీటిని నివారించేందుకు ప్రభుత్వం అప్పట్లో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. అంతేకాదు వీటికి సంబంధించిన సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్, వైబ్ సైట్ ను కూడా అందుబాటులో ఉంచింది. ఇక త్వరలో ఒలింపిక్స్ జరతున్న తరుణంలో ఇలా నల్లుల బెడద వేధించడం పెద్ద సమస్యగా మారింది. కీటకనాశనిలను ఉపయోగిస్తున్నా వాటికి సైతం అలవాటు పడిపోయిన నల్లులు తట్టుకొని నిలబడటంతో సమస్య మరింత తీవ్రంగా మారిందని నిపుణులు అంటున్నారు. అందమైన పర్యటక ప్రాంతంలో ఇలా నల్లుల బెడద ఎక్కువగా ఉండటంతో పారిస్ పరువు దెబ్బతింటుందని త్వరగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

 

Exit mobile version