Site icon NTV Telugu

Bear Fear in Srikakulam: ఎలుగుబంటి సంచారంతో జనం హడల్

Bear In Sklm (1)

Bear In Sklm (1)

ఏపీలో వివిధ జిల్లాల్లో వన్యప్రాణుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తూర్నుగోదావరి, విశాఖ జిల్లాల్లో బెంగాల్ టైగర్ ఎలాంటి వణుకు పుట్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లా ప్రజలను వన్య మృగాల సంచారం కలవరపెడుతోంది. జిల్లాలో ఒక ప్రక్క ఎలుగుబంట్ల సంచారం, మరో ప్రక్క పులి సంచారం వార్త జిల్లాలో కొండ చివరి ప్రాంతాల ప్రజలను హడలెత్తిస్తోంది. కోటబొమ్మాళి మండలం పట్టుపురం టు కొండపేట రోడ్డులో కొండపేట ఎత్తిపోతల పధకం సమీప ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచారం కలవరపెట్టింది

Read Also: Viral Video: హనుమంతుడి వేషధారణలో హుషారుగా డ్యాన్స్‌.. హఠాత్తుగా కుప్పకూలి..

రాత్రి పూట ఆ గ్రామాల్లో ప్రయాణం చేసిన వాహనదారులకు ఎలుగుబంటి రహదారి పై నడుస్తూ తారసపడడంతో భయాందోళనకు గురై వీడియో చిత్రకరించారు..ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులకు చీకటి పడితే అటు వెళ్లేందుకు భయపడుతున్నారు. మొన్నటి వరకు పలాస ప్రాంతాల్లో భయం రేపిన ఎలుగుబంట్లు ఇప్పుడు కోటబొమ్మాళి మండలం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎలుగుబంట్లను అడవుల్లోకి పంపే ఏర్పాట్లు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.

Read Also:CM Jagan Serious warning to Ministers : అన్నీ గమనిస్తున్నా.. ఇక ఉపేక్షించను

Exit mobile version