IPL 2024-BCCI: భారత అభిమానులకు షాక్.. యూఏఈలో ఐపీఎల్ 2024!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Second half of IPL 2024 is likely to be held in UAE: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ద్వితీయార్థం యూఏఈలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో ఐపీఎల్ మ్యాచ్‌ల తేదీలు క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందున టోర్నీ యూఏఈకి తరలిపోనుందట. ఇప్పటికే బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయ్‌కి వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే భారత అభిమానులకు షాక్ అనే చెప్పాలి.
‘భారత ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను దుబాయ్‌కి తరలించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం కొంతమంది బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయ్‌లో ఉన్నారు. ఐపీఎల్ ద్వితీయార్ధం దుబాయ్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి’ అని బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి. వీసాల కోసం ప్లేయర్స్ తమ పాస్‌పోర్ట్‌లను ఇవ్వాలని కొన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
Also Read: RCB vs MI: 4 పరుగులు ఇచ్చి ఓ వికెట్.. ఆర్‌సీబీ గేమ్ ఛేంజర్ శ్రేయాంక పాటిల్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014 ఐపీఎల్ ప్రథమార్థం యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలోనూ రెండేళ్లు యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలలో గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. 21 మ్యాచ్‌లతో కూడిన ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో చివరి మ్యాచ్ ఏప్రిల్ 7న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. మార్చి 22న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభమవుతుంది.
The Second half of IPL 2024 is likely to be held in UAE…!!!!! (TOI). pic.twitter.com/6HbyEWHEKU
— CricketMAN2 (@ImTanujSingh) March 16, 2024
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!