Site icon NTV Telugu

IPL 2025: క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ

Ipl

Ipl

ఐపీఎల్ 2025 క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్ జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. కాకినాడ లో ఐపీఎల్ మ్యాచ్ లు చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది బిసిసిఐ. జూన్ 1, 3 తేదీలలో జరిగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ చూడడానికి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి సారి కాకినాడ లో ప్యాన్ పార్క్ ఏర్పాటైంది. ఈ ఫ్యాన్ పార్క్ లోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు.

Also Read:Viral Video: అంత ఆగలేకపోతున్నారా ఏంటి.. పబ్లిక్‌గా రొమాన్స్‌లో మునిగితేలిన యువత..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 చివరి దశకు చేరుకుంది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. నేడు క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరగనుంది. ఇది జూన్ 1న అంటే ఈరోజు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. టైటిల్ కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version