Site icon NTV Telugu

GT vs CSK Qualifier-1: ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

Gtvscsk

Gtvscsk

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ.. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక నూతన కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్‌ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అందుకే మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో బౌలర్‌ రన్స్ ఇవ్వకుండా ‘డాట్‌ బాల్‌’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు.

Also Read : Haj Flights from Vijayawada: హజ్‌ యాత్రికులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. విజయవాడ నుంచి విమానాలు..

కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 84 డాట్‌బాల్స్‌ నమోదు అయ్యాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో 34.. మిగతా 50 డాట్‌బాల్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ప్రతీడాట్‌ బాల్‌కు 500 మొక్కలు చొప్పున 84 డాట్‌బాల్స్‌కు 42వేల మొక్కలు నాటనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్వయంగా తన ట్విటర్‌ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ మొక్కల కాన్సెప్ట్‌ మిగతా మూడు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకూ(ఫైనల్‌తో కలిపి) వర్తించనుంది. దీంతో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ముగిసేలోపే లక్షల్లో మొక్కలను నాటే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బీసీసీఐ, టాటా కలిపి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రశంసలతో పాటు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన దొరుకుతుంది.

Also Read : IT companies: సాఫ్ట్‌వేర్ కలలకు సంక్షోభం దెబ్బ.. 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు..

ఇక.. మంగళవారం నాడు జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 14 పరుగుల తేగాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. ఈ సీజన్ తో కలిపి ఇప్పటివరకు మొత్తం 14 సీజన్ లలో 10సార్లు ఫైనల్ కు వెళ్ళింది. 4సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై.. అత్యధికంగా 12 సార్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.


Exit mobile version