BCCI To Give Central Contract to Shreyas Iyer: బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో వీరిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్ బీసీసీఐ తొలగించింది. అయితే శ్రేయస్‌పై వేటు వేసిన బీసీసీఐపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.శ్రేయస్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్లు నిలిచారు. ఇంగ్లండ్ సిరీస్ ముందు రంజీట్రోఫీ ఆడాడని, వన్డే ప్రపంచకప్ 2023లో పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను తీసుకుని మరి ఆడాడని పేర్కొన్నారు.
మరోవైపు గాయంతో 4 నెలలు ఆటకు దూరమైన హార్దిక్ పాండ్య, రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదికి పైగా ఆడని రిషబ్ పంత్‌లకు ఏ ప్రాతిపదికన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇచ్చారని మాజీలు బీసీసీఐని ప్రశ్నించారు. దీంతో శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి బీసీసీఐ పునరాలోచనలో పడిందట. శ్రేయస్‌కు త్వరలోనే శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం.
Also Read: POCO X6 Neo Price: 16 వేలకే ‘పోకో X6 నియో’ స్మార్ట్‌ఫోన్.. 108 కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
శ్రేయస్ అయ్యర్ ముంబై తరఫున సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఆడాడు. విదర్భతో జరిగిన ఫైనల్లో రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేశాడు. అయితే వెన్నునొప్పి తిరగబెట్టడంతో శ్రేయస్ నాలుగు, అయిదు రోజు ఆటలో ఫీల్డింగ్‌కు రాలేదు. గాయం కారణంగా ఐపీఎల్ 2024కు శ్రేయస్ అందుబాటులో ఉండటం అనుమానమే అని వార్తలు వచ్చాయి. అయితే శ్రేయస్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం.