Site icon NTV Telugu

Ranji Trophy: రంజీ క్రికెట్లో మార్పులు.. ఇక నుంచి రెండు దఫాలు

Bcci

Bcci

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక రంజీ సీజన్‌ను ఇక నుంచి రెండు దశలుగా నిర్వహించనున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (bcci ) వెల్లడించింది. 2024- 25 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.. దీంతో రంజీ ట్రోఫీని రెండు దశల్లో ఆడించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నాట్ల టాక్ వినిపిస్తుంది. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో.. ‘దులీప్‌ ట్రోఫీతో సీజన్‌ స్టార్ట్ కాబోతుందని వెల్లడించారు.

Read Also: Game Changer : రాంచరణ్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ కు మోక్షం కలిగేది ఎప్పుడంటే..?

అయితే, ఆ తర్వాత ఇరానీ కప్‌ కూడా జరగనుంది. అనంతరం రంజీ ట్రోఫీలో భాగంగా ప్రతి జట్టు తమ తొలి ఐదు లీగ్‌ మ్యాచ్ లను ఆడనున్నాయి. అవి ముగిసిన తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే టోర్నమెంట్ జరగనుంది. చివర్లో మళ్లీ రంజీ రెండో దశను నిర్వహించేందుకు ప్రతిపాదించామని బీసీసీఐ పేర్కొనింది. దీనికి బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అలాగే, సీకే నాయుడు ట్రోఫీలో టాస్‌ను ఉపయోగించకుండా పర్యాటక జట్టు ఇష్ట ప్రకారం మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బీసీసీఐ యోచిస్తుంది.

Exit mobile version