NTV Telugu Site icon

Virat Kohli-BCCI: విరాట్ కోహ్లీకి ఆ విషయాన్ని బీసీసీఐ చెప్పలేదట!

Rahul Dravid Virat Kohli

Rahul Dravid Virat Kohli

Gautam Gambhir and Virat Kohli News: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. జులై చివరలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌తో కోచ్‌గా గౌతీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించే ముందు బీసీసీఐ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్‌ 2023 లో లక్నో, బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఐపీఎల్‌ 2024లో వీరిద్దరూ ఆలింగనం చేసుకుని.. తమ మధ్య విభేదాలకు పులిస్టాప్ పెట్టారు. ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు ఏ మేరకు సమన్వయం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Filmfare Awards 2023: ఆర్ఆర్ఆర్ చిత్రానికి 7 అవార్డులు.. తెలుగు అవార్డ్స్ లిస్ట్ ఇదే!

భారత జట్టు టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న హార్దిక్ పాండ్యాకు మాత్రం గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ ముందుగానే ఇచ్చినట్లు సమాచారం. ‘జట్టు గురించి చర్చించుకోవడానికి చాలా సమయం ఉంది. సమీప భవిష్యత్తులో యువ ఆటగాళ్లదే కీలకపాత్ర. అందుకే బీసీసీఐ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ కొనసాగనున్నాడు. గౌతీ నేతృత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025, టెస్టు ఛాంపియన్ షిప్‌ 2023-25, టీ20 ప్రపంచకప్ 2026, 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలు ఆడనుంది. ఈ మెగా టోర్నీల్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయడానికి గంభీర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి.

Show comments