BCCI announces India Womens ODI, T20I Squads for 2023 Bangladesh Tour: బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న వైట్ బాల్ టూర్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. బంగ్లా పర్యటనకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత భారత మహిళల జట్టు మ్యాచ్‌లు ఆడటం ఇదే మొదటిసారి.
బంగ్లాదేశ్ పర్యటనకు గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం అయింది. ఇక వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను సెలెక్టర్లు పక్కనబెట్టారు. రిచా స్థానంలో అసోం యువ వికెట్ కీపర్ ఉమా ఛెత్రి ఎంపికైంది. వెటరన్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదు.
భారత్, బంగ్లాదేశ్ పర్యటన జులై 9న ప్రారంభమై.. జులై 22 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లన్నీ మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.
Also Read: 11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
భారత్ టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), స్మాన్‌జోత్‌కీపర్ మేఘన, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి కనౌజియా, అనూషా బరేడి, మిన్ను మణి.
భారత్ వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్జ్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్, అమంజోత్), అమంజోత్ పునియా, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, అంజలి సరవాణి, మోనికా పటేల్, రాశి రాశి కనౌజియా, అనూషా బరేడి, స్నేహ రానా.
Also Read: Jonny Bairstow Run-Out: మరోసారి ఆస్ట్రేలియా చీటింగ్.. అనూహ్య రీతిలో బెయిర్‌స్టో అవుట్! (వీడియో)