NTV Telugu Site icon

Shakib Al Hasan: షకిబ్ సెక్యూరిటీతో మాకు సంబంధం లేదు: బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు

Shakib Al Hasan Retirement

Shakib Al Hasan Retirement

Shakib Al Hasan Retirement: బంగ్లాదేశ్‌ సీనియర్ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్ హసన్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ సందర్భంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బంగ్లాదేశ్‌లో తన భద్రతపై షకిబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు. వెళ్లాక బంగ్లాను వీడడమే కష్టం. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నా భద్రతపై ఆందోళనగా ఉన్నారు’ అని షకిబ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బంగ్లాదేశ్‌లో చివరి టెస్టు ఆడాలనుందని షకిబ్ అల్ హసన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (బీసీబీ) చీఫ్ ఫరూఖి అహ్మద్‌ స్పందించారు. షకిబ్ సెక్యూరిటీతో తమకు ఏ సంబంధం లేదన్నారు. ‘షకిబ్ సెక్యూరిటీ మా చేతుల్లో లేదు. బంగ్లా బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను ఇవ్వదు. షకిబ్ తన నిర్ణయం చెప్పాడు. అతడి సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. పోలీస్, రాబ్ మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. షకిబ్ విషయంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర. ఈ విషయంలో బీసీబీ ఎలాంటి ప్రకటన చేయదు’ అని ఫరూఖి తెలిపారు.

Also Read: iPhone 15 Discount: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఐఫోన్‌ 15పై 19వేల డిస్కౌంట్‌!

‘బంగ్లా విజయాల్లో షకిబ్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతడి పరిస్థితి క్లిష్టంగా ఉంది. షకిబ్ వ్యక్తిగత విషయాలపై మేం స్పందించలేం. సొంత మైదానంలో చివరి టెస్టు ఆడాలనుకుంటున్నాడు. మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ భద్రతకు సంబంధించి మేం ఎలాంటి భరోసా ఇవ్వలేం. చివరి టెస్టు ఆడేందుకు ఇదే సరైన సమయమని భావించి.. షకిబ్ ఆ ప్రకటన చేశాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం’ అని బీసీబీ చీఫ్ ఫరూఖి చెప్పుకొచ్చారు.