Site icon NTV Telugu

Justice Eswaraiah : బీసీలకు రావాల్సిన వాటా, రావాల్సిన రిజర్వేషన్ రావడం లేదు

Justice Eswaraiah

Justice Eswaraiah

ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఫెడరేషన్, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీలో రాహుల్ గాంధీనీ కలిశామని తెలిపారు జస్టిస్ ఈశ్వరయ్య.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ జన గణన చేయటం లేదు… ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా
అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కేటాయించిందని మండిపడ్డారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేస్తా ఉందని, మండల కమిషన్
సిఫార్సులను పట్టించుకోవడం లేదన్నారు. రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు పెడుతున్నారు తప్ప కుల జనగణ చేపట్టడం లేదని,
బీసీలకు రావాల్సిన వాటా , రావాల్సిన రిజర్వేషన్ రావడం లేదన్నారు ఈశ్వరయ్య. ఇండియాకుటమిలో ఒక్క రాహుల్ గాంధీ తప్ప బీసీ జన
గణను ఎవరు మాట్లాడటం లేదని, ఇండియా కూటమికి కి బిసి ఫెడరేషన్, బీసీ సంఘాలు మద్దతు ఇస్తామని ఆయన వెల్లడించారు. భారత్
జూడో న్యాయయాత్రకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చింది అక్కడ బీసీ జనగణ చేపట్టాలని కోరారు. తెలంగాణలో బీసీ జనగణ చేపటడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీసీ జనాలు కాంగ్రెస్
నమ్ముతారని, పొలిటికల్ పవర్ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

అనంతరం మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ తరఫున అన్ని రాష్ట్రాల నుంచి
రాహుల్ గాంధీని కలిసామన్నారు. బీసీ జనగణ జరపాలని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారని, మొట్టమొదటిసారి బీసీ ఫెడరేషన్
ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తా ఉందన్నారు. ఇండియాకుటమికి దేశవ్యాప్తంగా ఉన్న బిసి ఫెడరేషన్ మద్దతు ఇవ్వాలని నిర్ణయం
తీసుకుందన్నారు.

Exit mobile version