NTV Telugu Site icon

BC Janardhan Reddy: ప్రచారంలో దూసుకుపోతున్న బీసీ జనార్థన్ రెడ్డి..

Bc

Bc

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, కోవలకుంట్ల, బనగానపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కలిగే లబ్ది గురించి ప్రజల్లోకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి బలంగా తీసుకెళ్తున్నారు.

Read Also: Minister Seetakka: మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..

కాగా, బనగానపల్లె పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలుపెరగకుండా బీసీ జనార్థన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ.. ప్రజా సేవకులు, టీడీపీ ఉమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డినే గెలిపించాలని నియోజకవర్గ ప్రజలు ఫిక్స్ అయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీసీకి ఇంటింటా ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. తమ ఇంటికి పెద్ద కొడుకు వచ్చాడంటూ అవ్వ తాతలు బీసీ జనార్థన్ రెడ్డిని ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు. అలాగే, బీసీజేఆర్‌కు మహిళలు హారతులు పడుతూ, పూలమాలతో సత్కరిస్తూ.. తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు.

Read Also: Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..

ఇక, టీడీపీ అధికారంలోకి వస్తే.. సూపర్ సిక్స్ పథకాలతో కలిగే లబ్ది గురించి ప్రజలకు బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి వివరిస్తూ.. తనను గెలిపిస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా తానే కట్టించి ఇస్తానంటూ హామీ ఇస్తున్నారు. కాగా, బీసీ రాక సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, బీసీ అభిమానులతో కలిసి ప్రజలు సైతం… సైకిల్ గుర్తు ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై బీసీజేఆర్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తున్నారు. బనగానపల్లె పట్టణంలో బీసీ జనార్థన్ రెడ్డికి ప్రజలు దగ్గర నుంచి అందుతున్న అపూర్వ ప్రజాదరణ తెలుగు తమ్ముళ్లలో కదనోత్సాహం రగిలిస్తోంది. మే 13న జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్థన్ రెడ్డి విజయం సాధించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.