Site icon NTV Telugu

Rifle Competition : జాతీయ రైఫిల్ ఈవెంట్‌కు ఎంపికైన బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని

Mounika

Mounika

జాతీయ రైఫిల్ ఈవెంట్‌కు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని ఎంపికైంది. వచ్చే ఏడాది జరిగే జాతీయ రైఫిల్ పోటీలకు చార్మినార్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని మౌనిక ఎంపికైంది. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విద్యార్థిని సాధించిన విజయాన్ని అభినందించారు.
Also Read : Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు

ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ.. తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడే తన పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమాల్లో తొలిసారిగా షూట్ ఎలా చేయాలో నేర్చుకోవడం ప్రారంభించానన్నారు. తన కోచ్, స్కూల్ ప్రిన్సిపాల్, సెక్రటరీ కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పింది. మౌనిక గతంలో రాష్ట్ర స్థాయి, సౌత్ జోన్, నేషనల్ ఈవెంట్‌లలో పాల్గొంది. బీసీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం, ఈ యువ షూటర్ భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో ఉంది.
Also Read : Telangana Congress : పీసీసీ కమిటీ ప్రకటన..18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. పేర్లు ఇవే..!

Exit mobile version