NTV Telugu Site icon

Bazooka : వైరల్ అవుతున్న మమ్ముట్టి సెకండ్ లుక్..

Whatsapp Image 2023 11 13 At 11.03.57 Am

Whatsapp Image 2023 11 13 At 11.03.57 Am

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు..ఈ స్టార్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బజూక..గేమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న బజూక సినిమాకు డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. రీసెంట్ గా ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సెకండ్ లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.బజూక చిత్రం లో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, టామ్‌ షైన్‌ ఛాకో, సుమిత్‌ నావల్‌ మరియు సిద్దార్ధ్‌ భరతన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్‌ ఆఫ్ డ్రీమ్స్‌ అండ్‌ సరిగమ బ్యానర్లపై డోల్విన్‌ కురియాకోస్ జిన్‌ వీ అబ్రహాం, విక్రం మెహ్రా మరియు సిద్దార్థ్‌ ఆనంద్ కుమార్‌ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మిధున్‌ ముకుందన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స్టైలిష్‌ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన లుక్‌ తోనే అర్ధం అవుతుంది..ఈ సినిమాతో పాటు మమ్ముట్టి మరోవైపు హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌ లో నటిస్తున్నాడు… భ్రమయుగం టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి రాహుల్‌ శశీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ , వై నాట్ స్టూడియో బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ లో డార్క్‌ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని ఉన్నాడు.ఈ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మమ్ముట్టి మరో మూడు మలయాళ సినిమాల లో కూడా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో అలాగే మరొకటి షూటింగ్ దశలో ఉన్నాయి.