Site icon NTV Telugu

Vitality Blast: ఒక బాల్‌ను 2 సార్లు కొట్టిన బ్యాట్స్మెన్.. ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు..!

Grant

Grant

Vitality Blast: ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో వింత ఘటన జరిగింది. గ్లౌసెస్టర్‌షైర్ మరియు సోమర్‌సెట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్ గ్రాంట్ రోలోఫ్‌సెన్ ఒక బంతిని రెండుసార్లు కొట్టాడు. కావాలని కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు బంతి బ్యాట్ కు తగిలింది. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ అర్ధ సెంచరీ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్‌షైర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సోమర్‌సెట్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది.

Read Also: Virendra Sehwag : ఆదిపురుష్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన సెహ్వాగ్..

గ్లౌసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్ చేస్తున్నాడు. రెండో బంతికి గ్రాంట్.. కొద్దిగా లెగ్ సైడ్‌కు వెళ్లాడు. బ్యాట్స్ మెన్ ను గమనించి ఓవర్‌టన్ బౌన్సర్‌ బౌల్ వేశాడు. దానిని గ్రాంట్ పుల్ చేశాడు. ఇక్కడ అతను రెండుసార్లు బంతిని కొట్టాడు. లాగుతున్నప్పుడు బంతి మొదట గ్రాంట్ బ్యాట్ పైభాగానికి తగిలి బౌన్స్ అయింది. అదే సమయంలో అతని బ్యాట్ వెనక్కి వెళుతుండగా అది మళ్లీ బంతిని తాకి ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. ఈ బంతికి అతను ఒక పరుగు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ ఇన్నింగ్స్ 52 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 39 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.

Read Also: Manipur Violence: అఖిలపక్ష సమావేశం తర్వాత అమిత్ షాను కలిసిన మణిపూర్ సీఎం.. ఏం జరిగింది?

గ్రాంట్‌తో పాటు, జాక్ టేలర్ చివరికి 42 పరుగులతో అజేయంగా ఆడాడు. అతను 33 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో.. 36 పరుగులు చేశాడు. గ్రేమ్ వాన్ బ్యూరెన్ ఈ ఇన్నింగ్స్‌లో 21 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. సోమర్‌సెట్ తరఫున విల్ స్మీడ్ 42 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదిన అతను.. బెన్ గ్రీన్ 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు. కేసీ ఆల్డ్రిడ్జ్ అజేయంగా 32, ఓవర్టన్ అజేయంగా 17 పరుగులు చేయడంతో జట్టు విజయానికి చేరువైంది.

 

Exit mobile version