NTV Telugu Site icon

Bat Symbol Case: పాకిస్థాన్ లో బ్యాట్ సింబల్ గుర్తు కేటాయింపుపై వివాదం..

Pak

Pak

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌– ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ)కు బ్యాట్‌ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విధుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదని పాకిస్థాన్ సుప్రీం కోర్టు చీప్ జస్టీస్ క్వాజీ ఫయీజ్‌ ఇసా తెలిపారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించనందున పీటీఐకి ఎన్నికల గుర్తు బ్యాట్‌ను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇక, పీటీఐ పెషావర్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.

Read Also: Harish Rao: ఆటో కార్మికులను రోడ్డున పడేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పై హరీష్ రావ్ ఫైర్

ఇక, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని పెషావర్‌ హైకోర్టు తప్పు పట్టింది. బ్యాట్‌ గుర్తును పునరుద్ధరించాలంటూ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆప్ పాకిస్థాన్ చీఫ్ జస్టిస్‌ ఇసా పలు కీలక కామెంట్స్ చేశారు. రాజ్యాంగ, చట్టబద్ధమైన సంస్థ విధుల మధ్య చాలా స్పష్టమైన విభజన రేఖ ఉందని తెలిపారు. అయితే, ఈసీ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థకు అత్యున్నత ప్రతినిధిగా మేమెలా జోక్యం చేసుకోగలం? అదెలా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ.. రాజకీయ పార్టీల వ్యవహారాలను నియంత్రించడం, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం దాని బాధ్యత అని చీప్ జస్టీస్ క్వాజీ ఫయీజ్‌ ఇసా పేర్కొన్నారు.