NTV Telugu Site icon

Pakistan Cricket: ఈ బంగ్లా జట్టు పైనా ఓడింది.. పాక్‌ను ఏమనాలో కూడా తెలియడం లేదు!

Bangladesh Cricket Team

Bangladesh Cricket Team

Basit Ali About Bangladesh Team: ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించి.. టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లా.. అదే జోష్‌తో భారత పర్యటనకు వచ్చి చతికిల పడింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన బంగ్లాదేశ్‌.. టీ20ల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో బంగ్లాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చురకలు అంటించాడు. భారత్‌కు బంగ్లా కనీసం పోటీ ఇవ్వలేకపోతుందన్నాడు. ఇలాంటి బంగ్లా జట్టుపై టెస్టు సిరీస్‌ను ఓడిన పాక్‌ను ఏమనాలో తెలియడం లేదన్నాడు.

Also Read: Google Badges: గూగుల్‌ ‘వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌’.. ఇక ఫేక్‌ వెబ్‌సైట్లకు చెక్‌!

‘పాకిస్థాన్‌ను వైట్‌వాష్ (2-0) చేసిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా?. టెస్టు సిరీస్‌లో భారత్‌ చేతిలో బంగ్లాకు ఘోర పరాభవం ఎదురైంది. ఏడు సెషన్ల ఆట జరిగిన రెండో టెస్టులో ఓడిపోయింది. వర్షం కూడా వారిని రక్షించలేకపోయింది. తొలి టీ20లో బంగ్లా ఆటను చూశాం. భారత సీనియర్‌ టీమ్ బరిలోకి దిగలేదు. ఇది ఐపీఎల్‌లో ఒక టీమ్. శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, శ్రేయస్‌ అయ్యర్ వంటి ప్లేయర్లూ ఆడలేదు. అయినా కూడా భారత్ బలంగా ఉంది. ఈ టీమ్‌కు బంగ్లా పోటీ ఇవ్వలేకపోయింది. రెండో టీ20లో గెలిస్తే.. భారత్‌ తన రిజర్వ్‌బెంచ్‌తో బరిలోకి దిగుతుంది. ఇలాంటి బంగ్లా జట్టుతోనా పాక్ ఓడింది. మా జట్టును ఏమనాలో కూడా తెలియడం లేదు’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.

Show comments