Basara IIIT : ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్ నగర్ సెంటర్ లలో ఆరు సంవత్సరాల సమీకృత విద్యా విధానంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించుటకు అడ్మిషన్ నోటిఫికేషన్ ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. గ్రామీణ పేద విద్యార్థులకు 2008వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటయిందని, తదనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేద విద్యార్థులు పొందుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. నోటిఫికేషన్ వివరాలు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ. ఆర్ జి యు కే టి. ఏసి. ఇన్ వెబ్ సైట్ ను సందర్శించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓయస్డి ప్రాఫెసర్ మురళీ దర్శన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్ డాక్టర్ దేవరాజు, అసోసియేట్ డీన్ డాక్టర్ విటల్, మంతపురి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
- బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు ప్రారంభం
- ఆరు ఏళ్ల ఇంజినీరింగ్ కోర్సు నోటిఫికేషన్ విడుదల
- వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో

Basara Iiit