Site icon NTV Telugu

Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?

Chandrahas

Chandrahas

ప్రముఖ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ లైవ్‌లో పాడిన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు వేదికైంది. ఆ పాటలోని పదాలు అత్యంత అసభ్యకరంగా ఉండటంతో నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ వివాదం ముదరడంతో చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని మీడియా ముందుకు వచ్చి తమ వివరణ ఇచ్చారు. ఆ పాటలోని లిరిక్స్ విన్నప్పుడు తాము కూడా షాక్‌కు గురయ్యామని, అది తమ సినిమాలోని పాట కాదని వారు స్పష్టం చేశారు.

Also Read : Alia-Alpha : ఆలియా భట్ ‘ఆల్ఫా’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

ఆ పాటలోని పదాలు తమను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు.. అంతే కాదు ‘సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం మాకు లేదు. ఆ సమయంలో హీరో అలా పాడటం మాకు కూడా తెలియదు. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో మేము కష్టపడ్డాం, కానీ ఇలాంటి వివాదం వల్ల సినిమా పరువు పోవడం బాధగా ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలం ఉన్న పాటలకు తమ సినిమా మద్దతు ఇవ్వదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పాటపై వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే, హీరో అతి ఉత్సాహం సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చంద్రహాస్ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు, అయితే ఈసారి ‘బూతు పాట’ పాడటం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది.

Exit mobile version