NTV Telugu Site icon

Bihar : ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లోని ఆహారంలో పాము.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు

New Project 2024 06 17t121055.190

New Project 2024 06 17t121055.190

Bihar : బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ క్యాంటీన్ లోని ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులు తినే ఆహారంలో విషపూరతిత పాము పిల్ల కనిపించింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వారు వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్‌కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.

Read Also:Gudivada Amarnath: ఋషికొండ కట్టడాలపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి

బంకాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఓ విద్యార్థి ఆహారంలో చనిపోయిన పాము పిల్ల కనిపించిందని సహచరులు చెప్పారు. ఈ విషయాన్ని ఇతర విద్యార్థులకు చెప్పగా వారంతా ఆందోళనకు దిగారు. క్యాంటీన్‌లో భోజనం నాణ్యతపై గతంలో కూడా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ దీనిపై ఏనాడూ దృష్టి పెట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించగా.. ఆహారంలో విషపూరిత పాము కనిపించింది. ఆహారంలో పాము కనిపించిన సమయానికి, కొంతమంది విద్యార్థులు అప్పటికే తమ భోజనాన్ని ముగించారు.
Read Also:Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్

తిన్న తర్వాత ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. వెంటనే 15 మంది విద్యార్థులను బంకాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులందరినీ తిరిగి కళాశాలకు పంపించారు. విషయం తీవ్రతను గమనించిన బంక సదర్ ఎస్‌డిఎం, ఎస్‌డిపిఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత బంకా జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ కుమార్ కూడా కళాశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఆహారంలో కనిపించింది విషపూరిత పాము పిల్ల అని ఇంకా నిర్ధారణ కాలేదని బంకా ఎస్డీఓ అభినాష్ కుమార్ తెలిపారు. ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం పంపారు. అయితే ఆహారంలో నాణ్యత లేదని మెస్ యజమానికి జరిమానా విధించారు. విద్యార్థులను ఒప్పించిన తర్వాత మళ్లీ భోజనం సిద్ధం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌, విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.