Site icon NTV Telugu

Bank of Baroda Recruitment 2025: 10th పాసై ఖాళీగా ఉన్నారా? ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి

Bob

Bob

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి పాసైన యువతకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి (SSC/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి రాష్ట్రం/ప్రాంతం ప్రకారం స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి.

Also Read:Vizag Metro: విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 26 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PH (వికలాంగులు), మహిళా అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 19,500 ప్రారంభ వేతనం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 23 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Vizag Metro: విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్: 22 పోస్టులు
అస్సాం: 4 పోస్టులు
బీహార్: 23 పోస్టులు
చండీగఢ్ (UT): 1 పోస్ట్
ఛత్తీస్‌గఢ్: 12 పోస్టులు
దాద్రా & నగర్ హవేలీ (UT): 1 పోస్ట్
డామన్ & డయ్యూ (UT): 1 పోస్టు
ఢిల్లీ (UT): 10 పోస్టులు
గోవా: 3 పోస్టులు
గుజరాత్: 80 పోస్టులు
హర్యానా: 11 పోస్టులు
హిమాచల్ ప్రదేశ్: 3 పోస్టులు
జమ్మూ & కాశ్మీర్: 1 పోస్టు
జార్ఖండ్: 10 పోస్టులు
కర్ణాటక: 31 పోస్టులు
కేరళ: 19 పోస్టులు
మధ్యప్రదేశ్: 16 పోస్టులు
మహారాష్ట్ర: 29 పోస్టులు
మణిపూర్: 1 పోస్టు
నాగాలాండ్: 1 పోస్టు
ఒడిశా: 17 పోస్టులు
పంజాబ్: 14 పోస్టులు
రాజస్థాన్: 46 పోస్టులు
తమిళనాడు: 24 పోస్టులు
తెలంగాణ: 13 పోస్టులు
ఉత్తరప్రదేశ్: 83 పోస్టులు
ఉత్తరాఖండ్: 10 పోస్టులు
పశ్చిమ బెంగాల్: 14 పోస్టులు
మొత్తం : 500 పోస్టులు

Exit mobile version