Cyber Crime: స్మార్ట్ టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో.. అంతే వేగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ క్రైంలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఓ డాక్టర్ను పెళ్లిపేరుతో మోసం చేసి ఆమె దగ్గరనుంచి 13.50లక్షలు కాజేశారు కేటుగాళ్లు. అది మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. ఈ సారి ఏకంగా బంపర్ ఆఫర్ అని ఆశపెట్టి బ్యాంకు ఉద్యోగిని బురిడీ కొట్టించారు.
Read Also:Sand mafia: బరితెగించిన సాండ్ మాఫియా.. ఏకంగా కలెక్టర్ హతమార్చే యత్నం
‘‘ఒక థాలీ (భోజనం ప్లేటు) కొంటే.. మరో థాలీ ఉచితం. మా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి’’ అనే ప్రకటన వలలో పడి దేశ రాజధాని ఢిల్లీకి చెందిన మహిళ రూ.90 వేలు పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ బ్యాంకులో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు సవిత. ఫేస్‌బుక్‌లో ఉన్న ఈ ఆఫర్ గురించి తమ బంధువు ఒకరు చెప్పడంతో ప్రయత్నం చేసినట్లు తెలిపారు. జరిగిన మోసం గురించి వివరిస్తూ..‘సైట్‌లోకి వెళ్లి ఇచ్చిన నంబరుకు కాల్ చేశాను. వెంటనే రిప్లై రాలేదు. ఆ తర్వాత మళ్లీ నాకు ఫోను చేసి ‘‘సాగర్ రత్న’’ (ప్రముఖ చైన్ రెస్టారెంటు) ఆఫర్ గురించి కాలర్ చెప్పాడు. ఓ లింక్ పంపి, డౌన్‌లోడ్ చేసుకోవాలన్నాడు. యాప్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పంపాడు.
Read Also:Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య
ఆఫర్ ఉపయోగించుకోవాలంటే ముందుగా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నాడు. అన్నీ తాను చెప్పినట్టే చేశా. ఆ సమయంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఆ తర్వాత నా ఖాతా నుంచి రూ.40 వేలు, రూ.50 వేలు డ్రా చేసినట్లు సందేశాలు వచ్చాయి. ఆ డబ్బు నా క్రెడిట్‌కార్డు నుంచి నా పేటీఎం ఖాతాకు వెళ్లి.. మోసగాడి ఖాతాకు చేరడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలేవీ నేను కాలర్‌కు చెప్పలేదు. వెంటనే నా క్రెడిట్‌కార్డు బ్లాక్ చేయించాను’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
