Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ అందరినీ కదిలించింది. ఒక తండ్రి తన కూతురి స్కూల్ ఫీజు కట్టేందుకు నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును, అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురికి మందులు కొనేందుకు మరో తండ్రి దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన టైలర్ నూరుల్లాఖాన్ తన కుమార్తె స్కూల్ ఫీజు చెల్లించడానికి నెల రోజుల పాటు కష్టపడి రూ. 5 వేలు జమ చేశాడు. ఆ డబ్బుతో నూరుల్లాఖాన్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని జలగం వెంగళరావు పార్కు వద్ద సాదిక్ (39) అనే వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. బైక్ నుంచి పెట్రోల్ లీక్ అవుతోందని చెప్పి నూరుల్లాఖాన్ దృష్టిని మరల్చిన సాదిక్, అతడి జేబులోని రూ. 5 వేల నగదును చాకచక్యంగా తస్కరించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ, వాహనం నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి యాకుత్‌పురాకు చెందిన సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెప్పుల దుకాణంలో పనిచేసే సాదిక్, అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు మందులు కొనడానికి చేతిలో డబ్బులు లేక ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తాను దొంగిలించిన రూ. 5 వేలలో సుమారు రూ. 1,100 తన కుమార్తె మందుల కోసం ఖర్చు చేయగా, మిగిలిన నగదును పోలీసులు రికవరీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఈ ఇద్దరు తండ్రులు తమ కుమార్తెల అవసరాల గురించి చెప్పుకుంటూ కన్నీరుమున్నీరవ్వడంతో అక్కడున్న పోలీసులు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చట్టప్రకారం నిందితుడు సాదిక్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.
Also Read
- Hyderabad: కూకట్‌పల్లిలో భారీ సైబర్ మోసం.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 12.31 కోట్లు స్వాహా..
- Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ 'కింగ్‌పిన్' అరెస్ట్.. మస్కట్ నుంచి రప్పించి కటకటాల్లోకి నెట్టిన ఈడీ
- Gautam Gambhir: "మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది".. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
- EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
తాజావార్తలు
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
-
Hyderabad: కూకట్‌పల్లిలో భారీ సైబర్ మోసం.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 12.31 కోట్లు స్వాహా..
-
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ ‘కింగ్‌పిన్’ అరెస్ట్.. మస్కట్ నుంచి రప్పించి కటకటాల్లోకి నెట్టిన ఈడీ
-
Gautam Gambhir: “మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది”.. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
-
BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!