Site icon NTV Telugu

Hydra: బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా.. రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్..

Hydra1

Hydra1

Hydra: హైడ్రా బంజారాహిల్స్‌లో ఆక్రమణలను తొలగించింది. 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది ప్రభుత్వం. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా కాస్తున్నాడు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. అనేక నివప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. దీంతో జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

READ MORE: ఉత్సాహంగా జగన్ విశాఖ పర్యటన.. వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో కొత్త జోష్ !

ఫేక్ సర్వే నంబర్ (403/52) తో పార్థసారథి ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని హైడ్రా విచారణలో తేలింది. రెవెన్యూ, జలమండలి పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టింది. 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్టు హైడ్రా తెలింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించింది. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను హైడ్రా తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.

READ MORE: డిస్‌ప్లే, పర్ఫామెన్స్, బ్యాటరీ అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చేసిన Huawei MatePad 12 X టాబ్లెట్

Exit mobile version