Site icon NTV Telugu

Plane Emergency landing : నాగ్‌పూర్‌లో సలామ్ ఎయిర్ విమానం అత్యవసర ల్యాండింగ్

Plane

Plane

Plane Emergency landing : బుధవారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‎లోని చిట్టాగాండ్ నుంచి ఒమన్ వెళ్తున్న విమానం నాగపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్‌ గుర్తించాడు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అధికారులు అనమతించారు. ఈక్రమంలో విమానాశ్రయంలో అత్యతవసరి పరిస్థితి ప్రకటించారు. అంబులెన్సులు, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మొత్తం 200 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కార్గో ఏరియాలోనే పొగలు వచ్చాయని వెల్లడించారు. ప్రయాణికులను పైలట్‌ అప్రమత్తం చేశాడని చెప్పారు.

Read Also: Delhi Man: కుక్కపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు

ఈ మధ్యకాలంలో విమానాల్లో సాంకేతిక లోపాల కారణంగా విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలు ఎక్కువయ్యాయి. ఇది ఇలా ఉంటే, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవడం ఇది రెండో సారి. 2021లో బైమన్‌ బంగ్లాకు చెందిన విమానం పైలట్‌కు గుండెపోటు రావడంతో అత్యవసరంగా విమానాశ్రయంలో దిగింది. ఇక గతనెల 22న ఎయిరిండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని నెవార్క్‌ నుంచి 300 మంది ప్రయాణికులకు న్యూఢిల్లీకి వస్తున్న విమానం.. ఇంజిన్‌లో ఆయిల్‌ లీకవడంతో స్వీడన్‌లోని స్టాక్‌హోంలో దిగింది. అలాగే ఫిబ్రవరి 27న కోల్ కతానుంచి బ్యాంకాక్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కోల్ కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 178మంది ప్రయాణికులున్నారు.

Exit mobile version