Ban vs Zim: టీ-20 ప్రపంచ కప్ సూపర్ -15 గ్రూప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో ఎట్టకేలకు బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిసి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ శాంటో అర్ధశతకంతో రాణించాడు. 55 బంతుల్లో ఒక సిక్స్, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ డకౌట్ కాగా.. కెప్టెన్ షకీబుల్ హసన్ 23, హుస్సేన్ 29 పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ రెండేసి వికెట్ల పడగొట్టగా.. రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు కూడా గెలుపు కోసం పోరాటం చేసింది. చివరి వరకు విజయం నీదా నాదా అన్నట్లు మ్యాచ్ కొనసాగింది. వెంటవెంటనే మూడు కీలక వికెట్లను కోల్పోయిన జింబాబ్వే జట్టును సీన్ విలియమ్స్ ముందుండి నడిపించాడు. 42 బంతుల్లో 64 పరుగులు చేసి బంగ్లా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఓ దశలో మ్యాచ్ బంగ్లాదేశ్ చేయిదాటిపోయిందన్న దశలో సీన్ విలియమ్స్ రనౌట్ కావడంతో బంగ్లా బౌలర్లు మళ్లీ తమ ప్రతాపాన్ని చూపించారు. ర్యాన్ బర్ల్ 27 పరుగులతో బరిలో నిలిచినా చివరకు బంగ్లాదేశ్ విజయాన్ని నమోదు చేసింది.
Delhi Air Quality: ఢిల్లీలో మరింత క్షీణించిన వాయు నాణ్యత
చివరి ఓవర్‌లో కొంచెం ఉత్కంఠ కొనసాగింది. ఆ ఓవర్‌లో 6 పరుగులకు 16 కొట్టాల్సి ఉంది. క్రీజులో ర్యాన్ బర్ల్, నగరవ ఉండగా.. చివరి ఓవర్‌ను మొసద్దెక్ హొస్సేన్ వేశాడు. నగరవ రెండు బంతులను ఫోర్, సిక్సర్‌గా మలిచాడు. కానీ మరో బంతికి నగరవ ఔటయ్యాడు. ఇక ఒక బంతికి 5 పరుగులు రావాల్సి ఉంది. కానీ బ్యాటింగ్‌లో ముజరబానీ రావడంతో బంగ్లాదేశ్‌కు ఫలితంగా వచ్చింది. బౌలర్ చివరి బంతిని వేయగా.. ముజరబానీ ఔటయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్‌గా తేలింది. మరో బంతి వేసినా బ్యాట్స్ మెన్ ఉపయోగించుకోలేకపోయాడు. ఎట్టకేలకు బంగ్లాదేశ్ విజయం సాధించింది. జింబాబ్వే 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. మొసద్దెక్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ తలో రెండు వికెట్లు తీశారు.
