Bangladesh vs South Africa: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టోనీ డి జోర్జి (41) రాణించడంతో ప్రొటీస్ జట్టు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు దూకుడు ప్రదర్శించింది.
Read Also: Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ..
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు అల్ అవుట్ అవ్వగా.. కైల్ వెర్నీ (114) అద్భుత సెంచరీతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. దాంతో 106 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కగిసో రబడ 6 వికెట్లు తీశాడు. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ లో దక్షిణాఫ్రికా 7 లో మూడవ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు 3 టెస్టుల్లో ఓడి, 1 మ్యాచ్ డ్రా చేరుకున్నారు. దింతో ప్రొటీస్ జట్టు ఇప్పుడు 47.62 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు ఓడిన బంగ్లాదేశ్ జట్టు 30.56 శాతంతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ 2023-25లో 3 టెస్టులు గెలిచింది, 6 ఓడిపోయింది.
Read Also: MLC Jeevan Reddy: అవమానంగా భావిస్తున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ లకు జీవన్ రెడ్డి లేఖ..
దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉండటంతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు టేబుల్‌లో వాటి స్థానాలు దిగజారాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 44.44 శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఆడిన 9 టెస్టుల్లో 4 గెలిచి 5 ఓడిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 43.06 శాతంతో ఆరో స్థానానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 8 టెస్టుల్లో విజయం సాధించగా, 3 ఓడిపోయింది. ఇది కాకుండా 1 మ్యాచ్ డ్రా అయింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండో స్థానంలో ఉంది. 8 టెస్టుల్లో నెగ్గి, 3 టెస్టుల్లో ఓడిన కంగారూ జట్టు 62.50 శాతంతో ఉంది. శ్రీలంక క్రికెట్ జట్టు 55.56 శాతంతో 4 విజయాలతో మూడో స్థానంలో ఉంది.
An emphatic seven-wicket win for South Africa in Mirpur 👊#WTC25 | #BANvSA 📝: https://t.co/zk8iaMr2we pic.twitter.com/G2eSiCDpPx
— ICC (@ICC) October 24, 2024