NTV Telugu Site icon

Bangladesh : బంగ్లాదేశ్‌లో హింస తర్వాత.. ఇప్పుడు మరో సంక్షోభం.. ప్రజల ఆరాటం దేనికంటే?

New Project 2024 08 11t090033.165

New Project 2024 08 11t090033.165

Bangladesh : బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వం దేశం మొత్తం సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈలోగా బంగ్లాదేశ్ ప్రజలు మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. హింస తర్వాత, ప్రజలు ఇప్పుడు ప్రతి పైసా కోసం ఆరాటపడుతున్నారు. బంగ్లాదేశ్‌లోని చాలా బ్యాంకుల ఏటీఎంలు ఇప్పటికీ మూసి ఉన్నాయి. భద్రతా కారణాల వల్ల చాలా ఏటీఎంలకు డబ్బు డెలివరీ కావడం లేదు. ఇది కాకుండా ఇంకా చాలా బ్యాంకు శాఖలు తెరవలేదని నివేదిక పేర్కొంది. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు నగదు విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

జూలై నుంచి బంగ్లాదేశ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొదట కోటా సంస్కరణ ఉద్యమం, తరువాత వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం, పోలీసు చర్యల కారణంగా మొత్తం నాలుగు వందల మందికి పైగా మరణించారు. పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగినట్లు సమాచారం. పరిస్థితి ఇప్పుడు కొంత మెరుగుపడినప్పటికీ చాలా మంది ఇప్పటికీ సురక్షితంగా లేరని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఢాకాలోని కారవాన్ బజార్ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో వివిధ ఏటీఎంలు మూతపడ్డాయి. దీంతో వ్యాపారులు నగదు విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

Read Also:Sarabjot Singh-Job: నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు: సరబ్‌జ్యోత్‌

బ్యాంకులు తెరిచి ఉన్నా ఏటీఎం మూసి ఉండడానికి కారణం ఏమిటి? బంగ్లాదేశ్‌లోని చాలా బ్యాంకు ఏటీఎంలలో థర్డ్ పార్టీ కంపెనీ డబ్బు నింపుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితిలో థర్డ్ పార్టీ సర్వీస్ నిలిపివేసింది. ఫలితంగా చాలా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోకపోవడంతో దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలకు అంతరాయం ఏర్పడింది. కేవలం 4 బ్యాంకుల ఏటీఎంల నుంచి రోజుకు దాదాపు రూ.30 కోట్లు విత్‌డ్రా అవుతుండగా, గత గురువారం రూ.10 కోట్లు మాత్రమే వచ్చాయి. సెక్యురిటీ లేకపోవడంతో దేశవ్యాప్తంగా చాలా ఏటీఎంలు మూతపడ్డాయని బ్యాంకులు చెబుతున్నాయి. ఏటీఏంలు థర్డ్ పార్టీ ద్వారా నిర్వహించబడతాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సర్వీస్ మూసివేయబడింది. అందుకే ఏటీఎంలో డబ్బులు లేవు. దీంతో ఏటీఎంలు మూతపడ్డాయి.

బ్యాంక్ ఉద్యోగుల సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ బ్యాంకర్స్ బంగ్లాదేశ్’ అధ్యక్షుడు సలీం ఆర్.ఎఫ్. హుస్సేన్ కూడా ఈ సమస్యను అంగీకరించాడు. థర్డ్‌పార్టీ ఏజెన్సీల కార్యకలాపాలు మూసివేయడం వల్ల చాలా ఏటీఎంలకు డబ్బులు సరఫరా కావడం లేదని తెలిపారు. అయితే ఈ వారంలో పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also:Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..