Site icon NTV Telugu

IND vs BAN: రాణించిన బంగ్లా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Target

Target

ఆసియా క‌ప్ 2023లో టీమిండియా జట్టు ఇప్పటికే ఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్ కు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. వన్డేల్లోకి తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అరంగ్రేటం చేశాడు.

Read Also: Ravindra Jadeja: 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జడ్డూ భాయ్

అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 265 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగులతో పోరాడి, బంగ్లాకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. తోహిద్ హృదయ్, నసుమ్ అహ్మద్ కూడా తమ వంతు సహకారం అందించారు. అయితే, తంజీద్ హసన్ (13), లిట్టన్ దాస్ (0), అనాముల్ హక్ (4) వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. దాంతో బంగ్లాదేశ్ 28 పరుగులకే కీలకమైన 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Read Also: Nabha Natesh: బ్లాక్ ఫిట్ లో ‘ఇస్మార్ట్’ పోరి ఘాటు ఫోజులు..

ఇక, ఈ దశలో క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ సారథి షకీబుల్ హసన్, హృదయ్ జట్టును ఆదుకున్నారు. మొదట వికెట్లకు అడ్డుకట్ట వేసిన వీరు.. ఆ తర్వాత ధాటిగా ఆడారు. దాంతో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు సాగింది. ఈ దశలో భారీ సిక్సర్ బాదిన షకీబుల్ హసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ వైపు దూసుకెళ్తున్న షకీబుల్ హసన్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అవుటయ్యాడు. దాంతో 101 రన్స్ భాగస్వామ్యానికి తెర పడింది. కాసేపటికే హృదయ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని పెవిలియన్ బాట పట్టాడు. నసూమ్ అహ్మద్ వేగంగా ఆడాడు. మెహదీ హసన్ (29 నాటౌట్), హసన్ షకీబ్ (14 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేసింది. టీమిండియా టార్గెట్ 256 పరుగులు.. మూడు వికెట్లు తీసిన శార్థుల్, షమీ రెండు వికెట్లు.. తలో వికెట్ తీసుకున్న జడేజా, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్..

Exit mobile version