Bangladesh Cricketer Mohammad Naim firewalking ahead of Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగష్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్‌లు వన్డే ఫార్మాట్‌లో జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు ఆసియా కప్‌లో ఆడనున్నాయి. టోర్నీ చరిత్రలో తొలిసారిగా నేపాల్ ఆడనుంది. ఆగష్టు 30న పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 ఆరంభం కానుంది. టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి.
ఐసీసీ టోర్నీలలో పెద్ద జట్లకు షాకిస్తున్న బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియా కప్ గెలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే కసి మీదుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమ్ ప్రస్తుతం ఢాకాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటుంది. ఆటగాళ్లు అందరూ కఠోర సాధన చేస్తున్నారు. అయితే బంగ్లా ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ షేక్ మరింత కష్టపడుతున్నాడు. మెగా టోర్నీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకునేలా ప్రత్యేక శిక్షణను తీసుకుంటున్నాడు. ఇందుకోసం ఏకంగా నిప్పులపై నడుస్తున్నాడు.
ట్రైనర్ బిత్ రెహాన్ పర్యవేక్షణలో మొహమ్మద్ నయీమ్ షేక్ నిప్పుల మీద నడుస్తున్నాడు. ‘మైండ్ ట్రైనింగ్’లో భాగంగానే నయీమ్ ఫైర్ వాకింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నయీమ్ సాహసాన్ని బంగ్లా ఫాన్స్ ప్రశంసిస్తున్నారు. ‘నయీమ్ భాయ్.. నువ్ గ్రేట్’, ‘గ్రేట్ డెడికేషన్’, ‘ఈసారి కప్ మనదే’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓపెనర్ అయిన నయీమ్ పై బంగ్లా భారీ ఆశలు పెట్టుకుంది. మరో అతడు ఎలా ఆడతాడో చూడాలి.
Also Read: IND vs IRE: మెరిసిన రుతురాజ్, శాంసన్, రింకూ.. రెండో టీ20లో ఐర్లాండ్ చిత్తు!
గతేడాది జరిగిన ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. ఈసారి భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. షకీబుల్ హసన్ నేతృత్వంలోని బంగ్లా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది. కఠోర సాధన చేస్తున్న బంగ్లా ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి. నయీమ్ ఇప్పటివరకు ఒక టెస్టు, నాలుగు వన్డేలు, 35 టీ20లు ఆడాడు. వరుసగా 24, 10, 815 పరుగులు చేశాడు. ఆగష్టు 31న శ్రీలంకతో బంగ్లా తొలి మ్యాచ్ ఆడుతుంది.
Bangladesh's Mohammad Naim working with a mind trainer and firewalking ahead of Asia Cup 2023. pic.twitter.com/Byf2T8JMWn
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023