Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి తీవ్ర కలకలం రేగింది. తాజాగా మణికట్టు వ్యాపారం చేసుకునే ఒక హిందూ జ్యువెలర్ దారుణ హత్యకు గురయ్యారు. మైమన్ సింగ్ జిల్లాలోని ఒక స్లూయిస్ గేట్ వద్ద నీటిలో తేలుతున్న ప్లాస్టిక్ డ్రమ్‌లో ఆయన మృతదేహం కనిపించడం అక్కడి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వ్యక్తిని 50 ఏళ్ల నిరంజన్ చంద్ర సూత్రధార్గా గుర్తించారు. ఈయన అఠార్బాడీ బిల్డింగ్ ప్రాంతంలో ఒక జ్యువెలరీ షాపు నడుపుతూ, మైమన్ సింగ్‌లోని స్టేడియం ఏరియాలో భార్య, కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ‘దైనిక్ ఇత్తిఫాక్’ అనే బాంగ్లాదేశ్ పత్రిక కథనం ప్రకారం.. బేగున్బాడీ ప్రాంతంలోని స్లూయిస్ గేట్ వద్ద ఒక ప్లాస్టిక్ డ్రమ్ తేలుతూ ఉండడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ డ్రమ్‌ను తెరిచి చూడగా అందులో నిరంజన్ మృతదేహం బయటపడింది. ఆయన బాడీపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయి. దుండగులు ఆయనను హత్య చేసి, ఆ తర్వాతే మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆయన ట్రాజర్ జేబులో ‘మైమన్ సింగ్ హిందూ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ లిమిటెడ్’కు చెందిన ఒక టోకెన్ దొరికింది. కోత్వాలి మోడల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ రూహుల్ అమీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ టోకెన్ ఆధారంగానే పోలీసులు క్రెడిట్ యూనియన్ను సంప్రదించి, ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నిరంజన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆయన భార్య, కుమారుడు వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తులను ధ్రువీకరించారు. నిజానికి నిరంజన్ సెప్టెంబర్ 20 నుంచే కనిపించకుండా పోయారు. ఆ రోజు ఆయనను స్టేడియం ప్రాంతంలో తన మేనల్లుడు చూశాడు. అయితే, నిరంజన్ గతంలో కూడా కొన్నిసార్లు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి కొద్ది రోజులకు తిరిగి వచ్చేవారు. దాంతో ఈసారి కూడా అలాగే ఏదో పనిమీద వెళ్లి ఉంటారులే, రెండు రోజుల్లో వచ్చేస్తారని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆయన మిస్సింగ్ గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అంతలోనే ఇలా డ్రమ్‌లో శవమై తేలడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. శుక్రవారం ఉదయానికి కూడా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులెవరనేది పోలీసులు గుర్తించలేకపోయారు, ఎవరినీ అదుపులోకి కూడా తీసుకోలేదు. అసలు ఆయనను ఎందుకు చంపారనే కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో బాంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీ హిందూ సమాజం భద్రతపై మళ్లీ తీవ్రమైన చర్చ, ఆందోళన మొదలయ్యాయి.
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?