NTV Telugu Site icon

BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో రచ్చ.. హెడ్ కోచ్ హతురుసింగ సస్పెండ్

Bangladesh Cricket

Bangladesh Cricket

గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించినందుకు పురుషుల జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సస్పెండ్ చేసింది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ హతురుసింఘా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇటీవల భారత్‌తో జరిగిన అన్ని టెస్టులు, టీ20 సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. బీసీబీ (BCB) అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయించింది. అతను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వరకు హెడ్ కోచ్‌గా ఉండనున్నాడు.

Read Also: Andhra Pradesh: తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమ‌త్తం

ESPNcricinfo ప్రకారం.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండికా హతురుసింగ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఒక ఆటగాడిని చెంపదెబ్బ కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ 48 గంటల తర్వాత అతని ఒప్పందం ముగుస్తుంది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు హతురుసింఘతో ఒప్పందం ఉంది.

Read Also: Martin : సినిమాకి బాడ్ రివ్యూ.. సోషల్ మీడియా స్టార్ అరెస్ట్!

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం తర్వాత.. ప్రధాన కోచ్‌గా హతురుసింఘా సస్పెండ్ అయ్యాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. బీసీబీలో మార్పులు కనిపించాయి. అయితే.. తన కాంట్రాక్టును 2025 వరకు పూర్తి చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని హతురుసింఘ ఆగస్టులో చెప్పారు. “బోర్డు మారితే, కొత్త వ్యక్తులను మార్పులు చేయాలనుకుంటే దానితో నాకు ఇబ్బంది లేదు” అని ఆయన చెప్పారు. శ్రీలంక మాజీ క్రికెటర్ హతురుసింగ 2023 నుంచి రెండేళ్ల కాంట్రాక్ట్‌పై బంగ్లాదేశ్‌కు ఆల్ ఫార్మాట్ కోచ్‌గా నియమితులయ్యారు. 2014–17 తర్వాత బంగ్లాదేశ్ కోచ్‌గా హతురుసింఘకు ఇది రెండోసారి. మరోవైపు.. హతురుసింఘా శ్రీలంకకు కోచ్‌గా కూడా పని చేశాడు.

Show comments