Site icon NTV Telugu

Viral Video: అరె బాబు ఏంట్రా ఇది.. కీపర్ నిద్రపోతున్నావా ఏంటి?

Viral Video

Viral Video

Viral Video: అప్పుడప్పుడు క్రికెట్‌లో కొన్ని విచిత్రమైన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా బంగ్లాదేశ్ A , న్యూజిలాండ్ A జట్ల మధ్య జరిగిన వన్డేలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. మే 11 (ఆదివారం) జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హుస్సేన్ చేసిన హాస్యాస్పదమైన పొరపాటు న్యూజిలాండ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇచ్చింది. ఈ సంఘటన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఐదవ ఓవర్‌లో జరిగింది. ఎడాబోట్ హుస్సేన్ వేసిన ఐదో బంతిని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రీస్ మారియు ఆఫ్ స్టంప్ వెలుపల వదిలేశాడు. అయితే ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే… ఆ సమయంలో వికెట్ కీపర్ తన స్థానంలో లేకపోవడం. వికెట్ కీపర్ నూరుల్ హుస్సేన్ తన స్థానంలో కాకుండా ఫస్ట్ స్లిప్ వద్ద ఉన్నాడు.

Read Also: ATM Hack: తాళం వాడలేదు, పగులకొట్టలేదు.. కానీ 10 లక్షలు దోచేసిన దొంగలు.! ఎలా అంటే?

ఈ పొరపాటుతో బంతి అక్కడే ఉన్న హెల్మెట్‌ను తాకింది. క్రికెట్ నిబంధనల ప్రకారం ఆటలో ఉపయోగంలో లేని పరికరాన్ని బంతి తాకినపుడు బ్యాటింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు అందుతాయి. దీని వలన న్యూజిలాండ్ A జట్టుకు ఐదు అదనపు పరుగులు లభించాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక నెటిజన్స్ కీపర్ పై పెద్దెతున్న కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ A కెప్టెన్ నిక్ కెల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ A జట్టు మొదట బ్యాటింగ్ చేసి 47.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో యాసిర్ అలీ (65 బంతుల్లో 63), నాసుమ్ అహ్మద్ (97 బంతుల్లో 67) మంచి ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ తరఫున అదిత్య అశోక్ మూడు వికెట్లు తీయగా, జైదెన్ లెనాక్స్, బెన్ లిస్టర్ తలో రెండు వికెట్లు తీశారు.

Read Also: Triumph Scrambler 400 X: అదిరిపోయే లుక్ లో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ లాంచ్..!

ఇక 228 పరుగుల లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ జట్టు లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. డీన్ ఫాక్స్‌ క్రాఫ్ట్ (36) టాప్ స్కోరర్ కాగా, డేల్ ఫిలిప్స్ (34), జో కార్టర్ (33), రీస్ మారియు (33) కూడా సహకారం అందించారు. ఇక బౌలింగ్ లో నాసుమ్ అహ్మద్, నయీమ్ హుస్సేన్, మోసద్దెక్ హుస్సేన్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడో వన్డేను న్యూజిలాండ్ గెలిచినప్పటికీ, బంగ్లాదేశ్ A జట్టు 2–1తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్లు త్వరలో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనున్నాయి.

Exit mobile version