NTV Telugu Site icon

Bangalore Rave Party: ఎన్టీవీ చేతిలో బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్ట్.. వెలుగులోకి కీలక విషయాలు!

Rave Party

Rave Party

Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్‌గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్ , డీజేలు పెట్టీ.. డ్రగ్స్ విక్రయిస్తూ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలిగించారు. సోమవారం ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫార్మ్ హౌస్‌పై పోలీసులు రైడ్ చేశారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురు అరెస్ట్ అయ్యారు.

ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు నిందితులు వాసు, అరుణ్, సిద్ధికి, రన్దీర్, రాజ్ బవలు ఉన్నారు. నిర్వాహకుడు వాసు, అరుణ్ దగ్గరి బంధువులు అని తెలుస్తోంది. వాసు బర్త్ డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇంచార్జ్ గా ఉన్నాడు. ఈ పార్టీలో డ్రగ్ పెడ్లర్లు సిద్ధికి ,రన్దీర్, రాజ్ భవ్ పాల్గొన్నారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చలేదు. 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీలో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: KKR vs SRH Qualifier 1: స్టార్ ఓపెనర్ దూరం.. హైదరాబాద్‌తో తలపడే కోల్‌కతా తుది జట్టు ఇదే!

వాసు బర్త్ డే పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులతో పాటు వ్యాపార రాజకీయ నేతలు పట్టుపడ్డారట. 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల జాబితాలలో 100 నుంచి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. వీఐపీల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.