NTV Telugu Site icon

Actress Hema: బెంగుళూరు రేవ్‌పార్టీలో కీలక ట్విస్ట్.. నటి హేమ రక్తనమూనాల్లో డ్రగ్స్!

Actress Hema Event

Actress Hema Event

Actress Hema’S Blood Sample Tests Positive in Drug Test: బెంగళూరు రేవ్‌పార్టీలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం అయింది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కొటిక్ టీమ్ పేర్కొంది. దాంతో రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్ని అబద్దాలే అని తేలింది. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే.

రేవ్‌పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరు నార్కొటిక్ టీమ్ సేకరించింది. 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్ అని తేలింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు ​​జారీ చేసింది.

Also Read: Riyan Parag: ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ చరిత్ర.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు బద్దలు!

రేవ్‌పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌లోనే హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తాను రేవ్‌పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ ఓ వీడియో విడుదల చేశారు. అయితే రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని అప్పుడే స్పష్టం అయింది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్‌గా రావడంతో ఆమె బండారం బయటపడింది.