Site icon NTV Telugu

Actress Hema: బెంగళూరు రేవ్‌పార్టీ.. నటి హేమ వీడియోపై కేసు?

Hema Bangalore Rave Party

Hema Bangalore Rave Party

Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్‌పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ రేవ్‌పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

తాను బెంగళూరు రేవ్‌పార్టీలో లేనని, ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్నానని నటి హేమ ఓ వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు, హైదరాబాద్‌లోనే ఉన్నా. ఫామ్‌హౌస్‌లో నేను ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను అస్సలు నమ్మకండి. అవి ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’ అని హేమ విజ్ఞప్తి చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి అటెండ్ అయ్యేరని బెంగళూరు పోలీసులు ఫొటోలు రిలీజ్ చేశారు. రేవ్‌ పార్టీకి తాను వెళ్లలేదంటూ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో కనిపించారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని స్పష్టం అయింది.

Also Read: Harom Hara Movie: జూన్ 14న ‘సుబ్రహ్మణ్యం’ ఆగమనం!

రేవ్‌పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు విచారించారు. అందుకు సంబందించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఫామ్‌ హౌస్‌ గేటు నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించారు. అయితే తమ అదుపులోనే ఉన్నా.. హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన అబద్దపు వీడియోపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. రేవ్‌పార్టీలో పాల్గొన్నందుకు ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది.

Exit mobile version