NTV Telugu Site icon

Bangalore Rave Party 2024: బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం.. కఠిన చర్యలు తప్పవు: బెంగళూరు సీపీ

Bangalore Rave Party 2024

Bangalore Rave Party 2024

Bangalore CP React on Bangalore Rave Party 2024: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారని తెలుస్తోంది. ఆదివారం (మే 19) సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్‌గా పార్టీ జరగ్గా.. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పాల్గొన్నారట.

Also Read: KKR vs SRH Qualifier 1: కోల్‌కతాతో మ్యాచ్.. సన్‌రైజర్స్‌కు శుభవార్త!

బెంగళూరు సీపీ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు రేవ్‌పార్టీ కేస్ బదలీ చేశాం. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం. డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా చర్యలు తీసుకుంటాం.డ్రగ్స్ పెడ్లర్‌పైనే కఠిన చర్యలు ఉంటాయి చాలా మంది సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశాం. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. రేవు పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. రేవ్‌పార్టీకి ప్రజా ప్రతినిధులు ఎవరూ వచ్చినట్లు సమాచారం లేదని, ఇద్దరు నటులు దొరికారు అని బెంగళూరు సీటీ కమిషనర్ చెప్పారు.