Vegetarian Orders: వెజ్ ఫుడ్‌కి ఫుల్ డిమాండ్.. టాప్ 3లో హైదరాబాద్.. ఎక్కువ ఆర్డర్లు వీటికే..
- పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ నివేదికలో ఆసక్తికర అంశాలు..
- బెంగళూరు సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది వెజ్జీ వ్యాలీ అంటున్న స్విగ్గీ..
- అత్యధిక వెజ్ ఆర్డర్లలో రెండో స్థానంలో నిలిచిన ముంబై..
- ఈ 'ర్యాంకింగ్'లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన హైదరాబాద్..
- టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమేనని అని పేర్కొన్న స్విగ్గీ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetarian Orders: ఆన్లైన్ ఫుడ్ అనగానే ఎక్కువగా నాన్‌వెజ్ వైపే మొగ్గుచూపుతారని అనుకుంటాం.. కానీ, వెజ్‌కు కూడా మంచి డిమాండే ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే.. ముక్కలేనిది ముద్ద దిగదు అనే మాట వినిపడుతుంది.. అలాంటిది.. వెజ్ ఫుడ్ ఆర్డర్లలో టాప్ 3లో నిలిచింది మన మహానగరం.. పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.. స్విగ్గీ యొక్క అంతర్గత డేటా విశ్లేషణను విడుదల చేసింది. దాని ప్రకారం.. భారత్‌లోని ఈ సిటీలు అత్యధిక శాఖాహార ఆర్డర్లు కలిగి ఉన్నాయి..
Read Also: Israel: కేవలం 12 గంటల్లోనే.. ఇజ్రాయిల్ ఇద్దరు శత్రువుల హత్య..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
స్విగ్గి శాఖాహార ఆహార ఆర్డర్లపై అంతర్గత విశ్లేషణ ఫలితాలను విడుదల చేసింది. ఏ నగరంలో అత్యధిక వెజ్ ఆర్డర్లు ఉన్నాయో తెలిస్తే ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. బెంగుళూరు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది వెజ్జీ వ్యాలీ కూడా అంటూ పేర్కొంది.. ప్రతి మూడు శాకాహార స్విగ్గీ ఆర్డర్లలో ఒకటి బెంగళూరు నగరం నుండేనని నివేదిక వెల్లడించింది. ఇక, ఆ ఆర్డర్లలో మసాలా దోస, పనీర్ బిర్యానీ మరియు పనీర్ బటర్ మసాలా బెంగుళూరులో స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన టాప్ వెజ్ వంటకాలుగా పేర్కొంది..
Read Also: Karnataka Health Minister: జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే
ఇక, రెండవ అత్యధిక వెజ్ ఆర్డర్లను కలిగి ఉన్న సిటీ ముంబై అని పేర్కొంది స్విగ్గీ.. ఇక్కడ టాప్ వంటకాల విషయానికి వస్తే.. దాల్ ఖిచ్డీ, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ ఉన్నాయని తెలిపింది. ఈ ‘ర్యాంకింగ్’లో మూడవ స్థానం హైదరాబాద్ ఆక్రమించింది.. ఇక్కడ మసాలా దోస మరియు ఇడ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఆర్డర్లుగా స్విగ్గీ వెల్లడించింది.. దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన టాప్ 10 వంటకాల్లో ఆరు శాఖాహారమేనని అని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. మసాలా దోస, పనీర్ బటర్ మసాలా, మార్గరీటా పిజ్జా మరియు పావ్ భాజీ టాప్‌లో ఉన్నాయి.
Read Also: TB BCG Vaccines in AP: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి..
ఈ ప్లాట్‌ఫారమ్‌లో 90 శాతం కంటే ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్లు శాఖాహారం కాబట్టి, ఇది అల్పాహారాన్ని “శాఖాహార ఆర్డర్లకు గోల్డెన్ అవర్” అని పిలిచింది. మసాలా దోస, వడ, ఇడ్లీ మరియు పొంగల్ అత్యంత ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు. అయినప్పటికీ, “మసాలా దోస దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని చెప్పాలి.. బ్రేక్‌ఫాస్ట్ , లంచ్ మరియు డిన్నర్ కోసం ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక” అని హైలైట్ చేసింది. ఇక, స్విగ్గీలో వారానికి 60,000 వెజ్ సలాడ్లు ఆర్డర్ చేయబడతాయని తెలిపింది..
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!