Site icon NTV Telugu

Bangalore Rave Party 2024: రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన నటి ఉంది: బెంగళూరు సీపీ

Tollywood Actress Hema

Tollywood Actress Hema

Actress Hema in Bangalore Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవ్‌పార్టీకి హేమ హాజరయ్యారని బెంగళూరు పోలీసులు అంటుండగా.. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. పార్టీ సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉన్నారని ఈరోజు పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈరోజు బెంగళూరు సీపీ మీడియాతో మాట్లాడుతూ… బెంగళూరు రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉందని తెలిపారు. నిన్న హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌ హౌస్‌లోనిదే అని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఫామ్‌ హౌస్‌ గేటు నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే నేడు హేమ బిర్యానీ వండుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. నిన్న కూడా తాను హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో చిల్ అయ్యాయని పేర్కొన్నారు. బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నా కూడా.. అది తాను కాదని హేమ చెప్పడం విశేషం.

Also Read: Team India Coach: టీమిండియా కోచ్‌ పదవి.. అతడిని ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ ప్రయత్నాలు!

రేవ్‌పార్టీకి తాను వెళ్లలేదంటూ చేసిన వీడియోలో హేమ ఏ డ్రస్‌తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫొటోలోనూ అదే డ్రస్‌లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధం అని స్పష్టం అవుతోంది. రేవ్‌పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు పోలీసులు విచారించారట. రేవ్‌పార్టీలో పాల్గొన్నందుకు ఓ కేసు, హైదరాబాద్‌లో ఉన్నట్లు విడుదల చేసిన అబద్దపు వీడియోపై మరో కేసును పోలీసులు ఆమెపై నమోదు చేశారని తెలుస్తోంది.

Exit mobile version